రజనీకాంత్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం... `రోబో`. ఆ తరవాత.. రోబో 2 కూడా వచ్చింది. ప్రముఖ రచయిత అరుర్ తమిళ్‌నందన్ `జిగుబా` కథను కాపీ కొట్టి శంకర్ తీసారని విమర్శలొచ్చాయి. ఈ విషయంపై అరుర్ తమిళ్ నందన్ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో శంకర్‌పై చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైనట్టు వార్తలు వచ్చాయి.
అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు కూడా పలు ప్రతికలు ప్రచురించాయి. తమిళ మీడియా అంతా.. ఇదే వార్త చక్కర్లు కొట్టింది.. దీనిపై శంకర్ స్పందించారు. తనపై ఎలాంటి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయంపై ఎలాంటి తప్పుడు కథనాలు రాయోద్దు అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.