హీరోయిన్ ని అవమానించిన దర్శకుడు

మరిన్ని వార్తలు

కోలీవుడ్ సీనియర్ దర్శకుడు, నటుడు అయిన టి. రాజేందర్ మీడియా ముందు హీరోయిన్ ని అవమానించాడు. ఇది తట్టుకోలేని  హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.

వివరాల్లోకి వెళితే రజనీ కాంత్ నటించిన 'కబాలి' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ధన్సిక. ఈమె నటించిన కొత్త చిత్రం 'విళిథిరు' మూవీ ప్రెస్ మీట్ ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా ధన్సిక సినిమా యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్పింది. ఈ చిత్రంలో ఒక పాటలో నటించిన రాజేందర్ పేరు ప్రస్తావించటం మరిచిపోయింది. దీంతో ఆయన ధన్సిక ను దూషించాడు. కబాలి చిత్రంలో నటించినంత మాత్రాన నన్ను మర్చిపోవాలన్న నియమం లేదని ఘాటుగా వాఖ్యానించాడు.

దీంతో వెంటనే ధన్సిక ఆయన పాదాలు తాకి క్షమించమని కోరింది. అయినా క్షమించకుండా, 'నువ్వు శారీ కట్టుకోలేదు కాబట్టి, నీ సారీ నాకు అక్కర్లేదు'. 'నువ్వు హన్సిక అయితే నాకేంటి, ధన్సిక అయితే నాకేంటి' అంటూ అవమానించాడు. రాజేందర్ ఇలా మాట్లాడుతున్నా ఒక్కరూ ఆయన్ని ఆపకపోవటం విశేషం. ఇది తట్టుకోలేకపోయిన ధన్సిక వేదిక పైనే కన్నీరు పెట్టుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS