బెల్లంకొండ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరంగేగ్రం చేసి తన రేంజ్‌లో దూసుకెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో వయసు ట్వంటీస్ మాత్రమే. కానీ మనోడితో జత కట్టే ముద్దుగుమ్మల వయసు మాత్రం అంతకు మించే. తొలి సినిమా 'అల్లుడు శీను' నుండీ బెల్లంకొండ హీరోయిన్లు ఓ సెన్సేషనే. అత్యథిక రెమ్యునరేషన్ తీసుకుంది ఈ సినిమాతోనే ముద్దుగుమ్మ సమంత. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేటప్పటికి సమంత వయసు మూడు పదులకు దగ్గరైపోయింది. హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఆరేళ్ళు. అలాగే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించిన తమన్నా కూడా హీరోకి వయసు పరంగానూ సీనియర్ హీరోయినే. వయసు పరంగా, కెరీర్ పరంగా, అలాగే తదుపరి సినిమాలో నటించిన సోనారిక కూడా శ్రీనివాస్ కన్నా వయసులో పెద్దదే. అయితే కొద్ది నెలలు మాత్రమే గ్యాప్ ఈ ఇద్దరికీ. ప్రస్తుతం బెల్లంకొండ నటిస్తున్న 'జయ జానకీ నాయకా' సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా శ్రీనివాస్ కన్నా పెెద్దది కావడం విశేషం. సీనియర్ నటీమణులే కాకుండా, వయసులోనూ సీనియారిటీ ఉన్న హీరోయిన్లతో నటిస్తున్న శ్రీనివాస్ అందుకే సెన్సేషనల్ యంగ్ హీరో అయ్యాడు. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా 'జయ జానకీ నాయకా' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. చాలా ప్లజెంట్‌గా అలరిస్తోంది. లక్కీ మస్కెట్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షనే కాకుండా, సినిమా సక్సెస్ విషయంలో కూడా మెయిన్ ఎలిమెంట్ కానుంది. తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. పూజా హెగ్దే కూడా శ్రీనివాస్ కన్నా వయసులో పెద్దది కావడం విశేషం.