దక్షిణ భారతదేశంలో థియేటర్ల బంద్ గత శుక్రవారం నుండి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే శుక్రవారం నుండే నిర్మాతలకి-ప్రొవైడర్లకి మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి అని సమాచారం. ఇరువైపులా నుండి మధ్యస్తంగా ఒక సామరస్య పూర్వకమైన రాజీకి వచ్చారు అని తెలుస్తున్నది. వీరి మధ్య సయోధ్య కుదిరితే ఇంకొక 3 రోజులు అనగా వచ్చే శుక్రవారం నుండి సినిమా థియేటర్లు పనిచేసే అవకాశం ఉంది.
కాకపోతే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇంకా వెలువడలేదు. ప్రస్తుతానికి సినిమా థియేటర్ల బంద్ నేపధ్యంలో నిర్మాతలకి, పంపీణీదారులకి, ధియేటర్ యాజమాన్యాలకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అదే సందర్భంలో సినీ అభిమానులకి ఇది ఒక పరీక్షలా తయారయ్యింది.
చూద్దాం.. ఏమి జరగనుందో ఈ అంశంలో..