'వైశాఖం' చిన్న సినిమా కాదండోయ్‌

మరిన్ని వార్తలు

సినిమా అంటే సినిమానే. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న ప్రశ్న సినిమా రిలీజ్‌కి ముందు వరకే. సినిమా రిలీజ్‌ అయ్యాక ఆ సినిమా విజయమే, ఆ సినిమా రేంజ్‌ని డిసైడ్‌ చేస్తుంది. కొన్ని సినిమాలు ప్రారంభమయ్యేటప్పుడు చిన్నగా ఉంటాయి, విడుదలకు దగ్గరయ్యేసరికి పెద్ద సినిమాలన్పించుకుంటాయి. ప్రీ రిలీజ్‌ ఆ సినిమాలకు ఏర్పడే హైప్‌ని బట్టి ఇమేజ్‌ అలా పెరిగిపోతుంది. 'వైశాఖం' కూడా ఆ కోవలోకే వస్తుంది. అభిరుచిగల నిర్మాత బి.ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహిళా దర్శకురాలు బి.జయ రూపొందించిన ఈ చిత్రంలో కొత్త జంట అవంతిక, హరీష్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేపే విడుదల కానుంది ఈ చిత్రం. సినిమా ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. స్టిల్స్‌ ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇదొక కూల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ అనే ఫీలింగ్‌ని కలిగిస్తోంది. ఏ సినిమా అయినా విడుదలకు ముందు ఇలాంటి టాక్‌ రాబట్టుకోవడమంటే గొప్ప అంశంగానే పరిగణించాలి. సినిమా ప్రమోషన్‌ కోసం అక్కినేని నాగచైతన్య, అక్కినేని నాగార్జున కూడా వచ్చారంటే ఈ సినిమాని చిన్న సినిమా అని ఎలా అనుకోగలం? సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ వ్యాపిస్తున్న కారణంగా 'వైశాఖం' విడుదలకు ముందే పెద్ద సినిమా అన్పించుకుంది. ప్రీ రిలీజ్‌ టాక్‌, పోస్ట్‌ రిలీజ్‌ కూడా అలాగే ఉంటే 'వైశాఖం' పెద్ద విజయం సాధించడం ఖాయం. ఆల్‌ ది బెస్ట్‌ టు 'వైశాఖం' టీమ్‌. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS