మెగాస్టార్‌ ఆలోచనలు మారుతున్నాయట

మరిన్ని వార్తలు

చిరంజీవి హీరోగా రూపొందనున్న 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే ప్రచారం జరుగుతుండగా, దానికన్నా ముందు ఇంకో సినిమా ఆయన చేయవచ్చన్న గాసిప్స్‌ మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఎందుకంటే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఓ యజ్ఞం. అది ఇప్పుడు ప్రారంభిస్తే, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అత్యంత భారీ స్థాయిలో ఆ చిత్రాన్ని నిర్మించవలసి ఉంటుంది. గ్రాఫిక్స్‌ హంగామాకే ఎక్కువ సమయం పట్టేయవచ్చు. సుదీర్ఘ అనుభవం ఉన్న చిరంజీవికి ఈ లెక్కలు బాగా తెలుసు. అందుకే ఈలోగా ఓ కమర్షియల్‌ సినిమాని చేసేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయనకు కలుగుతోందట. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో అభిమానుల్ని ఉర్రూతలూగించిన చిరంజీవి, తన అభిమానుల్ని కొంత కాలం గ్యాప్‌ చేయమని ఇంకోసారి కోరకపోవచ్చు. అన్నీ ఆలోచించిన తర్వాత ఓ కమర్షియల్‌ సినిమాకి మెగాస్టార్‌ పచ్చ జెండా ఊపేస్తున్నారనే హాట్‌ గాసిప్‌ ఒకటి లేటెస్ట్‌గా ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? వంటి అంశాలపై క్లారిటీ లేదు. కమింగ్‌ డేస్‌లో పూర్తి క్లారిటీ వస్తుందట. అయితే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఆగిపోవడమో, పోస్ట్‌ పోన్‌ అవడమో జరగదట. దాని దారి దానిదే, దీనిదారి దీనిదేనట. ఏంటో ఇందులో నిజమేంటో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS