'కాటమరాయుడు' సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల్లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈలోగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని భారీగా నిర్వహించడానికి సన్నాహాలు చేసింది చిత్ర యూనిట్. మార్చి 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. మరో పక్క సోషల్ మీడియాలో విడుదలైన ఈ సినిమా సాంగ్స్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. నాలుగు పాటలు విడుదలయ్యాయి ఇప్పటికే. మిర్రా మిర్రా మీసం.. అంటూ సాగే తొలి పాట మాస్‌ని ఎట్రాక్ట్ చేస్తూండగా, మిగతా మూడు పాటల్ని కూడా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా ఫ్యాన్స్ ఈ ఫంక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌కి కొన్ని సర్‌ప్రైజులు ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. మొత్తానికి ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ రెండూ కలిసిన ఈ వేడుక అత్యంత ఘనంగా జరగబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జంటగా ముద్దుగుమ్మ శృతిహాసన్ నటిస్తోంది. పవన్‌తో రెండోసారి జత కడుతోన్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో కొంచెం హాట్‌గా కనిపిస్తోంది. కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.