'బాహుబలి' తర్వాత రాజమౌళి ఏం చేస్తాడు? తెలుగులో సినిమాలు కొనసాగిస్తాడా? బాలీవుడ్‌కి వెళతాడా? హాలీవుడ్‌లో ట్రై చేస్తాడా? అనే ప్రశ్నలు నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎక్కువగా వినవస్తున్నాయి. రాజమౌళిని హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్‌గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కొనియాడితే, రాజమౌళిని చూపిస్తూ హాలీవుడ్‌కి సవాల్ విసిరారు కొందరు తెలుగు సినీ ప్రముఖులు. అయితే వారి మాటల్లో విషయం ఉంది. రాజమౌళి ఆలోచనలు హాలీవుడ్ రేంజ్‌లోనే ఉంటాయి. తెలుగు సినిమా బడ్జెట్‌కి ఇప్పుడు ఆకాశమే హద్దు. మార్కెటింగ్ చేసుకోగలిగితే ఎంత బడ్జెట్ అయినా పెట్టేయవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాజమౌళి నుంచి హాలీవుడ్ నుంచి ఎందుకు ఆశించలేం? పైగా రాజమౌళి అంటే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉంది. కాబట్టి హాలీవుడ్ సినిమా రాజమౌళి నుంచి వస్తే, దానికి ఇండియా నుంచే మెజార్టీ వసూళ్ళు వస్తాయి. అదెలాగూ అద్భుతంగా ఉంటుంది కాబట్టి, ప్రపంచ దేశాల్లోనూ ప్రభంజనం సృష్టించవచ్చు. కాబట్టి రాజమౌళి మదిలో హాలీవుడ్ ఆలోచనలుంటే, నిస్సందేహంగా వాటిని అమల్లో పెట్టేయవచ్చు. ఆ హాలీవుడ్ సినిమా కూడా మన తెలుగు స్టార్స్‌తో ఉంటే అదింకా గొప్ప విషయం అవుతుంది. ఆల్ ది బెస్ట్ రాజమౌళి.