'మహాభారతం' ఓ అద్భుతం. రామాయణం, మహాభారతం.. ఈ రెండిటినుంచే వందలాది, వేలాది, లక్షలాది కథలు పుట్టుకొస్తాయని చెప్పొచ్చు. వీటిల్లోని ఒక్కో పాత్ర ఒక్కో అద్భుతం. ఒక్కో పాత్ర చుట్టూనే వందలాది కథలు రూపొందించొచ్చు. ఏ పాత్ర గొప్పతనం ఆ పాత్రదే. అందుకే వీటిని ఎన్నిసార్లు తీసినా, మళ్ళీ మళ్ళీ విజయాల్ని అందుకుంటూనే ఉంటాయి. అవి పుస్తకాలైనా, సినిమాలైనా. 'మహాభారతం'ను సినిమాగా వెయ్యి కోట్లతో తెరకెక్కించేందుకు రంగం సిద్ధమయ్యింది. మోహన్‌లాల్‌తో ఈ సినిమా రూపొందించనున్నారు. ఆరు భాషల్లో మొదట ఈ సినిమాని విడుదల చేస్తారట. 2020 నాటికి సినిమా విడుదలవుతుందని సమాచారమ్. అయితే 'మహాభారతం'ను సినిమాగా తీయాలని రాజమౌళి ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. దాంతో రాజమౌళి చేజారిపోయింది 'మహాభారతం' అని అప్పుడే ప్రచారం మొదలైంది. ముందే చెప్పుకున్నట్లు 'మహాభారతం'ను ఎన్నిసార్లైనా తీయొచ్చు. అందులో గాఢతని తెలుసుకున్నారు కాబట్టే బాలీవుడ్ నటులు షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ 'మహాభారతం' సినిమాగా తీస్తే నటించడానికి, నిర్మాతలుగా పెట్టుబడులు పెట్టడానికీ సిద్ధమని ప్రకటించారు. రాజమౌళి దృష్టిలో 'మహాభారతం' తెలుగు నటులతోపాటు, వివిధ భాషలకు చెందిన నటీనటులతో తెరకెక్కించాల్సి ఉంటుంది. రాజమౌళి అనుకున్నాడంటే చేసేస్తాడు, అది చేజారిపోయిందన్న భావన అనవసరం. ఇంకెవరు ఎంత గొప్పగా తీసినా, రాజమౌళి తీస్తే ఆ కిక్కే వేరప్పా.