గడ్డం లేటెస్ట్ ఫ్యాషన్. కుర్ర హీరోలంతా ఇప్పుడు గడ్డాల మీద రీసెర్చ్ చేసేస్తున్నారు. లేటెస్ట్గా ఈ ట్రెండ్‌ని ఫాలో అయిపోతున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. వాస్తవమేంటంటే, రామ్ మొదట్లో ఎక్కువగా గడ్డంతోనే కనిపించేవాడు. తర్వాత్తర్వాత క్లీన్ షేవ్‌తో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ గడ్డం ట్రెండ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ గడ్డంతో పదింతల స్టైల్‌తో రామ్, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. రామ్ హీరోగా ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో 'నేను శైలజ' సినిమా రావడం, అది మంచి విజయాన్ని అందుకోవడం తెలిసిన సంగతులే కదా. రామ్ - కిషోర్ కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రంలో మేఘా ఆకాష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోనిదే కావొచ్చు బహుశా రామ్ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటో. 'జీవితంలో ఏం చేస్తున్నావని కాదు. నీకు నువ్వు గర్వపడేలా పని చెయ్' అని సందేశాన్నిస్తూ రామ్ సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోకి మంచి స్పందన వస్తోంది. స్టైల్ ఐకాన్‌గా, ఎనర్జిటిక్ హీరోగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఈ సినిమా కోసం ఇంకా ఎనర్జిటిక్‌గా కనిపించనున్నాడట. కుర్రాడు ఫొటోలోనే కత్తిలాగున్నాడు. కిషోర్ తిరుమల 'నేను శైలజ' సినిమాలో సెంటిమెంట్ కంటెంట్ ఎక్కువ పెట్టేశాడు కాబట్టి, రామ్ ఎనర్జీ కంప్లీట్‌గా బయటకు రాలేదుగానీ, ఈసారి మాత్రం కంప్లీట్ ఎనర్జీ బయటకు వస్తుందట. ఫొటో చూస్తే మేటర్ అర్థమవుతోంది కదా!