'అఖిల్' సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ ముద్దుగుమ్మ డాన్సుల్లో సూపర్బ్ ఎనర్జీని కనబరుస్తుందన్న సంగతి తొలి సినిమాతోనే ప్రూవ్ అయిపోయింది. అఖిల్‌తో పోటీ పడి డాన్సులేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే 'అఖిల్' సినిమా నిరాశ పరచడంతో అమ్మడికి తెలుగులో మరో అవకాశం రాకుండా పోయింది. 'అఖిల్' తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అజయ్ దేవగణ్‌తో 'శివాయ్' సినిమాలో నటించింది. అయితే ఎప్పటికైనా తెలుగులో మంచి నటిని అనిపించుకోవాలన్న ఆమె తపన మాత్రం తగ్గడం లేదట. తెలుగు ప్రేక్షకులకు ఏదో ఒక రకంగా దగ్గరగా ఉండాలని అనుకుంటోందట. టాలీవుడ్‌కి సంబంధించి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోనంటోంది. అమ్మడు డాన్సుల్లో ఫుల్ ఎనర్జిటిక్‌గా పర్ఫామ్ చేస్తుంది. డాన్సంటే తనకి ప్రాణం అంటోంది. డాన్సు చేయమంటే ఎంతసేపైనా అలసిపోను అంటోంది. అవార్డు ఫంక్షన్స్‌లో అలసిపోకుండా ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేసి ఆడియన్స్ దృష్టిలో నిలుస్తూ ఉంటుంది సాయేషా. సాయేషాకి ఒళ్లంతా వయ్యారమే. కానీ హీరోయిన్గా దూసుకెళ్లాలంటే టాలెంట్‌తో పాటు కూసింత లక్ కూడా కలసి రావాలి. అ లక్ ఎప్పటికి కలిసొస్తుందో కానీ, ఒక్కసారి ఛాన్స్ దొరికిందంటే చెలరేగిపోతానంటోంది. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత నడుస్తోంది. ఈ తరుణంలో అమ్మడికి ఏమైనా అవకాశాలు చిక్కుతాయేమో చూడాలి మరి.