శృతిహాసన్‌ చెప్పింది నిజమేనా?

మరిన్ని వార్తలు

శృతిహాసన్‌ హీరోయిన్‌గా 'సంఘమిత్ర' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెష్‌ అప్‌డేట్‌ ప్రకారం ఈ సినిమా నుండి శృతిహాసన్‌ తప్పుకుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ డైరెక్టర్‌ సుందర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, ప్రచార చిత్రాలను విడుదల చేశారు కూడా. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చారిత్రాత్మక చిత్రమిది. ఇలాంటి చిత్రంలో నటించడం నా అదృష్టమంటూ శృతిహాసన్‌ ఇప్పటికే పలు మార్లు చెప్పింది కూడా. కానీ తాజాగా శృతినే చెబుతోంది ఈ సినిమాలో తాను నటించడం లేదనీ. ఎందుకంటే ఈ సినిమా కోసం రెండు నుండి మూడేళ్లు డేట్స్‌ ఇవ్వాల్సి వస్తోందట. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించి కథ విషయంలో ఇంకా చిత్ర యూనిట్‌కి క్లారిటీ లేదంట. క్లారిటీ లేకుండా రెండేళ్లు పూర్తిగా తాను ఎలా కమిట్‌ కాగలనని శృతి అంటోంది. శృతి మాటల్లో నిజమెంతని తెలీదు కానీ, 200 కోట్ల భారీ బడ్జెట్‌ మూవీగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం విషయంలో అంత క్లారిటీ లేకుండా ఎలా ఈ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేస్తారు? సో ఇదంతా రూమర్స్‌ అంటూ ఓ పక్క ప్రచారం జరుగుతోంది. ఇలాంటి చిత్రంలో నటించడం అంటే, శృతి కెరీర్‌కే ది బెస్ట్‌ టర్నింట్‌ అవుతుందది. అలాంటిది శృతి ఎందుకిలా చేస్తుంది? ఈ విషయంలో ఆడియన్స్‌కి క్లారిటీ రావాల్సి ఉంది. అది రావాలి అంటే శృతిహాసన్‌ స్వయంగా నోరు విప్పాల్సి ఉంటుంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS