బ్రాండ్ కా బాప్ దిశా పటానీ ఇంకోసారి అందాల రచ్చ చేసింది. రచ్చ అన్నది చిన్న మాటే. బీభత్సం అనాలేమో. బ్లాక్ హాట్ డ్రస్‌లో ఘాటుగా అందాలారేస్తూ, వలపుల వల విసురుతోంది. ఈ వంపుల తార వల'పులి'లా రువ్వతుంటే, ఇంకేముంది, చూపు తిప్పుకోగలరా.? అందుకే ఈ లేటెస్ట్ పిక్స్‌కి వస్తున్న రెస్పాన్స్ మాటల్లో చెప్పలేనిది. అందాల విందుతో పాటు, హాట్ అండ్ సెక్సీ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం దిశా పటానీ స్పెషాలిటీ.
అదే స్పెషాలిటీ ఈ తాజా స్టిల్లోనూ షేర్ చేసిందీ అందాల హాట్ భామ. ఈ హాట్ స్టిల్‌కి మెడలో ధరించిన సిల్వర్ ప్యాటర్న్ చైన్ మరింత ధగధగలు కురిపిస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా హంగామాతో పాటు, బాలీవుడ్లో పలు ప్రెస్జీజియస్ మూవీస్‌లోనూ దిశా పటానీ నటిస్తోంది. తెలుగులో 'లోఫర్' సినిమాలో నటించిన దిశా మళ్లీ మంచి ఆఫర్ వస్తే, తెలుగులో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు పంపుతోంది.