టాలీవుడ్ టికెట్ రేట్ల గురించి పెద్ద చర్చే నడుస్తుంది. బడ్జెట్ పెరిగిందని టికెట్ రేట్లు పెంచడం కారణంగా ప్రేక్షకులు థియేటర్ కి దూరం అవుతున్నారని స్వయంగా నిర్మాతలే గ్రహించారు. మా సినిమాకి మాములు రేట్లే అని స్పెషల్ ఇప్పుడు ఒక పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలపై నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి స్పదించారు. చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచకూడదు. నేను దీనికి మొదటి నుండి వ్యతిరేకం. బడ్జెట్ పెరిగిందని టికెట్ రేటు పంచడం తప్పు కదా. సినిమా మూడు వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. ఇంట్లోనే చూసుకునే అవకాశం వున్నప్పుడు అంత డబ్బు ఎందుకు పెట్టాలి? బాహుబలి 2 నైజాంలో బేసిక్ ధరలకే రూ. 55 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు రేట్లు ఎందుకు పెంచుతున్నారు ? టికెట్ అందరికీ అందుబాటులో వుంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు, ఫ్యామిలీతో వస్తారు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 4000ఖర్చు అయితే థియేటర్ కి ఎందుకు వస్తారు ? రేట్లు పెంచడం సినిమాకే నష్టం'' అని స్పష్టం చేశారు