అంచనాలకు మించిన విజయం అందుకుంది డిజే టిల్లు. కేవలం టిల్లు పాత్రపావు నడిచిన ఈ సినిమా సితార బ్యానర్ కి మంచి విజయాన్ని ఇచ్చిన చిత్రంగా నిలిచింది.అలాగే సిద్దు జొన్నల గడ్డ కి ఈ సినిమా సేఫరేట్ క్రేజ్ ని తెచ్చి పెట్టింది, ఈ సినిమాకి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఐతే అనూహ్యంగా దర్శకుడు విమల్ కృష్ణ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. క్రియేటివ్ విభేదాల వలన తప్పుకున్నాడని టాక్.
మరో దర్శకుడి కోసం అన్వేషించిన నిర్మాతలు. ఇప్పుడా కొత్త దర్శకుడు ఫైనల్ అయ్యాడు. మల్లిక్ రామ్ ని డిజే టిల్లు 2 కి దర్శకుడిగా ఖరారు చేశారు. గతంలో నరుడా డోనరుడు, అద్భతం సినిమాలతో పాటు పెళ్లి గోల వెబ్ సిరిస్ ని దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ ఇప్పుడీ ,క్రేజీ సీక్వెల్ కి దర్శకుడిగా వచ్చారు. ఆగస్ట్ 16 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తారు. టిల్లు పాత్రని మాత్రమే తీసుకొని మొత్తం కొత్త కథతో ఈ సీక్వెల్ వుండబోతుంది.