తనని తాను గుర్తు చేసుకుంటోన్న అల్లరోడి హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో అల్లరి నరేష్‌ నటించిన 'మేడ మీద అబ్బాయ్‌' సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ పేరు గుర్తుందా.? అయ్యో లేదా.? ఫర్వాలేదులెండి. పేరు గుర్తు లేకుంటే మాత్రం పాపలో మంచి టాలెంట్‌ ఉంది. ఎంతైనా మలయాళ కుట్టి కదా. ఇంతకీ ఎవరా భామ అనుకుంటున్నారా.? పేరు నిఖిలా విమల్‌. 'మేడ మీద అబ్బాయ్‌' సినిమాతో తెరంగేట్రం చేసింది. మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషించిన 'గాయత్రి' సినిమాలోనూ ఈ భామ హీరోయిన్‌గా నటించింది.

 

ప్రస్తుతం తమిళ హీరో కార్తి నటిస్తున్న 'దొంగ' సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. 'దొంగ' చిత్రానికి సంబంధించి హీరో కార్తి తర్వాత, ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్న జ్యోతిక పేరు మాత్రమే బాగా వినిపిస్తోంది. హీరోయిన్‌గా నటిస్తున్న నిఖిలా విమల్‌ పేరు పెద్దగా వినిపించడం లేదు. అందుకే తనని తాను గుర్తు చేసుకుంటోంది. 'నేను మీకేం కొత్త కాదబ్బాయిలూ.. ఆల్రెడీ పరిచయమే..' అని తన గత చిత్రాలను గురించి వివరించి చెబుతోంది. ఏమో కార్తి పుణ్యమా అని నిఖిలా విమల్‌ దశ తిరుగుతుందేమో చూడాలి మరి. డిశంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS