సురేష్ బాబు చేతిలో బోలెడన్ని థియేటర్లు ఉన్నాయి. ఓసినిమా విడుదల కావాలంటే... ఆయన ఆశీస్సులు తప్పనిసరి. అయితే చేతిలో అన్ని థియేటర్లు ఉన్నా, ఆయన మాత్రం ఓటీటీనే నమ్ముకోవడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్‌లో ప్రస్తుతం 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నారప్ప, దృశ్యమ్ 2, విరాటపర్వం.. ఇవి మూడూ విడుదలకు రెడీనే. అయితే ఈ మూడూ ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయడానికి... సురేష్ బాబు ఫిక్సయ్యారన్నది టాలీవుడ్ టాక్.
వెంకటేష్ నటించిన `నారప్ప`కు ముందు నుంచీ ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. `దృశ్యమ్ 2` కేవలం ఓటీటీని దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా. ఈ రెండు సినిమాల్నీ దాదాపుగా 70 కోట్లకు అమ్మేశారన్నది లేటెస్ట్ న్యూస్. నారప్ప అమేజాన్ ప్రైమ్ లోనూ. దృశ్యమ్ 2.. హాట్ స్టార్‌లోనూ విడుదల కానున్నాయని తెలుస్తోంది. మరోవైపు విరాటపర్వం డీల్ కూడా దాదాపుగా క్లోజ్ అయినట్టు సమాచారం అందుతోంది.
నెట్ ఫ్లిక్స్ కి ఈ సినిమాని అమ్మే ఆలోచనలో ఉన్నారు. ఎలా చూసినా.. సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు థియేటర్ల కంటే ఓటీటీని నమ్ముకోవడం.. చిత్రసీమని ఆశ్చర్యపరిచే విషయమే. త్వరలోనే థియేటర్లు తెరచుకునే అవకాశం ఉన్నా - ఓటీటీవైపు చూస్తున్నారంటే - నిర్మాతలు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారో అర్థమవుతూనే వుంది.