దుల్కర్ కోసం బాల‌య్య వెయిటింగ్‌!

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ - బాబీ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగిపోతోంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ఫ‌స్టాఫ్‌కి సంబంధించిన సన్నివేశాల‌న్నీ చ‌క చ‌క పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు సెకండాఫ్ బాకీ. ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. త‌న డేట్ల కోసం చిత్ర‌బృందం ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అత్యంత కీల‌కం. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌నున్నాడు. అత‌ను ఎంట్రీ ఇస్తే... సెకండాఫ్‌లో కీల‌క‌భాగం పూర్త‌యిన‌ట్టే.


బాబీ డీయోల్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించ‌నున్నాడు. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. ద‌స‌రాకి వ‌స్తే బాగుంటుంద‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. అప్ప‌టికి సినిమా పూర్త‌వుతుందా, లేదా? అనేది చూడాలి. వీలైనంత వ‌ర‌కూ పండ‌క్కే ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకొంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS