కాంట్రవర్సీలు, ట్వీట్ అటాక్స్, లిరిక్స్ పై అభ్యంతరాలు ఇలా అనేక ట్విస్టుల మధ్య విడుదలైన దువ్వాడ జగన్నాధం చిత్రం రూ 100కోట్ల మార్కుని అడ్డుకుంది. అయితే ఈ కలెక్షన్స్ కూడా ఫేక్ అంటూ బన్నీ యాంటీ ఫ్యాన్స్ ట్వీట్స్ చేయడం చూశాము.
అయితే హరీష్ శంకర్ మాత్రం అవి తప్పు అని నిరూపిస్తే తాను దర్శకత్వం వదిలేస్తానని ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. ఇవ్వన్ని ఇటుంచితే, DJ చిత్రం ఒక్క నైజాం ఏరియాలో రూ 20కోట్ల మార్కుని దాటింది.
ఇలా రూ 20కోట్లు నైజాంలో దాటడం అల్లు అర్జున్ కెరీర్ లోనే మొదటిసారి అలాగే హరీష్ శంకర్ కెరీర్ లో రెండవ సారి. ఆయన గబ్బర్ సింగ్ చిత్రం సైతం రూ 20 కోట్ల మార్కెట్ ని దాటడం విశేషం.
మోత్తానికి, బన్నీ DJ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భజే భజే అనేసింది.