అభిరుచి గల నిర్మాతగా డివివి దానయ్య పేరు మొదటి వరుసలో ఉంటుందని చెప్పాలి. పెద్ద సినిమాలు చేస్తూ అప్పుడప్పుడూ చిన్న సినిమాలు కూడా రూపొందిస్తూ సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు దానయ్య. గతేడాది నేచురల్ స్టార్ నానితో 'నిన్ను కోరి' సినిమాతో మంచి విజయం అందుకున్నారు.
2018లో రెండు భారీ బడ్జెట్ సినిమాలతో రానున్నారు. ఆల్రెడీ మహేష్‌బాబుతో డి.వి.వి దానయ్య 'భరత్ అనే నేను' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది. సినిమాని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దానయ్య సినిమాలన్నీ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. అలాగే ఈ ఏడాది రెండు సినిమాలు దానయ్య నిర్మాణంలో రానున్నాయి.
ఒకటి మహేష్ సినిమా కాగా, మరోటి మెగా పవర్‌స్టార్ స్టార్ రామ్‌చరణ్ సినిమా. ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైందీ సినిమా. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కూడా కైరా అద్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే ఈ ముద్దుగుమ్మ రెండు ప్రెస్టీజియస్ బ్యానర్స్‌లో ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి నటించే అవకాశం కొట్టేసింది. ఇకపోతే చరణ్‌తో గతంలో 'నాయక్', బ్రూస్లీ' చిత్రాలను నిర్మించారు డివివి దానయ్య. తాజాగా చరణ్‌తో రూపొందిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందట.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాదిలోనే ఈ సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది చరణ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేందుకే ఈ ఏడాది రెండు సినిమాలతో అభిమానులను అలరించనున్నాడు చరణ్. మార్చి 30న చరణ్ నటిస్తున్న 'రంగస్థలం' ప్రేక్షకుల ముందుకు రానుంది.