కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం `అమిగోస్`. ఈనెల 10న విడుదల అవుతోంది. ఇందులో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ట్రైలర్, టీజర్.. పాటలూ అన్నీ ఆకట్టుకొంటున్నాయి. వాటితో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. బింబిసార తరవాత వస్తున్న సినిమా ఇది. దాంతో.. మరింత ఆసక్తి నెలకొంది. వీటికి తోడు.. ధర్మక్షేత్రంలోని `ఎన్నో రాత్రులు వస్తాయి కానీ..` అనే పాటని ఈసినిమా కోసం రీమిక్స్ చేశారు. ఆ పాట ఈ సినిమాకి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కానుంది. అయితే ఈ పాట చివరి నిమిషంలో యాడింగ్ అనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సినిమా అంతా అయ్యాక... ఈ పాటని జోడించారని చెప్పుకొంటున్నారు. దీనిపై కల్యాణ్ రామ్ స్పందించారు. ఈ పాట ఆలోచన స్క్రిప్టు దశలో లేదని, చివర్లో జోడించామని చెప్పుకొచ్చారు కల్యాణ్ రామ్.
''సెకండాఫ్‌లో ఓ పాట కావాలి. ఆ పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలయ్యే ప్రమాదం ఉంది. కానీ సినిమాకి చాలా అవసరం. అలాంటప్పుడు ఎలాంటి పాట పెట్టాలి? అనుకొన్నాం. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కచ్చితంగా ఈ పాట వచ్చే సందర్భం ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. ఓ మంచి పాటని రీమిక్స్ చేశాం. దాన్ని చక్కగా వాడుకొన్నాం అనే ఫీల్ అవుతున్నాం'' అని చెప్పుకొచ్చాడు కల్యాణ్ రామ్.