రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వరంగల్ లో ఆత్మీయ వేడుక నిర్వహించింది . తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ వేడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రానాకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
రానా గారి తాత, నాన్న గారు నాకు మంచి స్నేహితులు. ఈ రోజు రానా గారు వరంగల్ రావాడం చాలా సంతోషం. సాయి పల్లవి మా ఆడబిడ్డే. నవీన్ చంద్ర, ప్రియమణి , దర్శకుడు వేణు ఉడుగుల, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి , నిర్మాత సుధాకర్.. అందరూ వరంగల్ రావడం ఆనందంగా వుంది. వరంగల్ లో వేడుకలు జరుపుకున్న ప్రతి సినిమా విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది' అన్నారు. ఇదే సందర్భంలో రానాని ఉద్దేశించి మాట్లాడుతూ.. రానా గారి తాత, నాన్న హైదరాబాద్ లో పెద్ద స్టూడియో కట్టారు. రానా వరంగల్ లో స్టూడియో పెట్టాలి. లాండ్ ఇప్పించే భాద్యత నాది'' అని హామీ ఇచ్చారు ఎర్రబెల్లి.