పెద్ద సినిమా.. పైగా మల్టీస్టారర్... దానికి తోడు హిట్ ఫ్రాంచైజీ. అయినా అడ్వాన్స్ బుకింక్స్ లేవు. దాంతో.. దిల్ రాజు గుండెల్లో గుబులు మొదలైంది.
ఎఫ్ 3 శుక్రవారం విడుదల అవుతోంది. ఎఫ్ 2 సూపర్ హిట్ అవ్వడంతో, ఎఫ్ 3పై క్రేజ్ పెరిగింది. టీజర్లు, ట్రైలర్లు, పాటలూ అన్నీ బాగానే ఉన్నాయ్. దానికి తోడు ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు.ఎక్కడ చూసినా ఎఫ్ 3 హంగామానే. అన్నింటికంటే ముఖ్యంగా - `సాధారణ టికెట్ రేట్లకే సినిమా` అంటూ మధ్యతరగతి ప్రేక్షకుల్ని థియేటర్లవైపు రప్పించడానికి చూస్తున్నారు. అయినా సరే, ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. చాలా థియేటర్లలో సగం టికెట్లు కూడా అమ్ముడవలేదు. సినిమా రిలీజ్‌కి ఇంకో 24 గంటలు కూడా లేదు. అయినా సరే, ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా మౌత్ టాక్ ని బట్టి... రెస్పాన్స్ని బట్టి, ప్రేక్షకుల మూడ్ సెట్ మారే అవకాశం ఉంది. శుక్రవారం ఫస్ట్ షో పడగానే.. టాక్ బయటకు వస్తుంది. అది చూసైనా జనాలు థియేటర్లకు రావాలి,
``ఎఫ్ 3 మాస్ సినిమా కాదు. ఫ్యామిలీ సినిమా. కుటుంబ ప్రేక్షకులే ఈ సినిమాకి బలం. వాళ్లు మౌత్ టాక్ ని బట్టే థియేటర్లకు వస్తారు. శని, ఆదివారాల నుంచి... థియేటర్లు నిండుతాయి`` అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.