తెలుగు నాట 100 కోట్లు వసూలు చేసిన చిత్రాల్లో `ఎఫ్ 2` కూడా ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్‌లో అత్యధిక లాభాల్ని అందుకున్న సినిమా ఇది. అందుకే ఈ సినిమా అంటే దిల్ రాజుకీ చాలా సెంటిమెంట్. ఇప్పుడు ఎఫ్ 3 సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఎఫ్ 3 బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. ఎఫ్ 3 ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫైటింగులు, ఛేజింగులు, భారీ సెట్లూ అవసరం లేదు. అయినా సరే, ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సునీత పెళ్లి వాయిదా?నిజానికి కేవలం పారితోషికాలకే 50 కోట్లు ఖర్చు పెట్టబోతున్నార్ట. వెంకటేష్‌కి 12 కోట్లు, వరుణ్‌కి 8 కోట్లు ఇస్తే.. అక్కడే 20 కోట్లు అయిపోయాయి. దర్శకుడు అనిల్ రావిపూడి పారితోషికం 12 కోట్లట. తమన్నాకు 2 కోట్లు, దేవిశ్రీ ప్రసాద్ కి 3 కోట్లు ఇస్తున్నారు. ఈ లెక్కన పారితోషికాలన్నీ కలిపి 50 కోట్లు అనుకోవాలి. ప్రొడక్షన్ కోసం మరో 30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎఫ్ 2 ఎలాగూ 100 కోట్లు తెచ్చుకుంది కాబట్టి, ఎఫ్ 3 కోసం 80 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద రిస్క్ కాదన్నది దిల్ రాజు అభిప్రాయం.