తెలుగు సినిమాకి శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇప్పుడు ప్రధాన బలంగా మారాయి. దాదాపు సగం బడ్జెట్ ఈ రెండింటితోనే తెచ్చేసుకుంటున్నాయి కొన్ని సినిమాలు. థియేటర్లు లేని సమయంలో చిన్న సినిమాల్ని ఓటీటీలే బతికించాయి. ఇప్పుడు క్రమంగా ఓటీటీ మార్కెట్ మరింత బలపడింది. అక్కడి నుంచి... మన సినిమాలకు మంచి రేట్లు గిట్టు బాటు అవుతున్నాయి.
తాజాగా ఎఫ్ 3 సినిమాకి అటు శాటిలైట్, ఇటు డిజిటల్ రేట్లు బాగా గిట్టుబాటు అయ్యాయి. జీ సినిమా... ఎఫ్ 3 శాటిలైట్ రైట్స్‌ని 12 కోట్లకు కొనుగోలు చేసింది. అమేజాన్ ప్రైమ్‌కి ఓటీటీ రైట్స్ దక్కాయి. ఏకంగా 12 కోట్లకు అమేజాన్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది. అంటే రెండింటి ద్వారా 24 కోట్లు వచ్చాయన్నమాట. ఈ సినిమాకి 80 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని టాక్. హిందీ డబ్బింగ్ ద్వారా మరో 10 కోట్లు వచ్చాయనుకుంటే... మిగిలినవి... థియేటరికల్ రైట్స్ ద్వారా తెచ్చుకోవాలి. సో.. ఎఫ్ 3 టార్గెట్ చాలా ఈజీ అయిపోయింది.