తెలుగులో కొనసాగింపు చిత్రాలు హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువ. బాహుబలి రెండు భాగాలు కాబట్టి... దాన్ని కొనసాగింపు చిత్రంగా చూడలేం. మనీ.. మనీ-మనీ మినహాయిస్తే ఆ తరహా మ్యాజిక్ చేసిన సినిమా... ఎఫ్ 2, ఎఫ్ 3. తెలుగులో ఫ్రాంచైజీ చిత్రాల సంప్రదాయానికి కొత్త ఊపు తీసుకొచ్చిన సినిమాలివి. ఎఫ్ 2పై ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. సైలెంట్‌గా వచ్చి సూపర్ హిట్టయ్యింది. ఎఫ్ 3 అయితే వంద కోట్లు కొట్టేసింది. అందుకే అందరి దృష్టీ.. ఎఫ్ 4పై పడింది. ఎఫ్ 4 కాస్త ఆలస్యమైనా.. తప్పకుండా ఉంటుంది. 2024లో ఎఫ్ 4ని చూడొచ్చు. అయితే.. ఈసారి సీజన్ లో తమన్నా ఉండదు.
ఎఫ్ 4 తీసినా, ఫ్రాంచైజీలో చాలా మార్పులు ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి ముందే హింట్ ఇచ్చేశాడు. హీరోయిన్లు మారే అవకాశం ఉంది తేల్చేశాడు. పైగా తమన్నాకీ, రావిపూడీకీ మధ్య చెడిందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఎఫ్ 3 ప్రమోషన్లకు కూడా తమన్నా రాలేదు. సో.. ఎఫ్ 4లో ఆమె కచ్చితంగా ఉండదు. మెహరీన్ కీ ఈసారి ఛాన్స్ ఉండదని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఎందుకంటే.. ఎఫ్ 3లోనే తను చాలా డీ గ్లామర్‌గా కనిపించింది. 2024 కి ఆమె క్రేజ్ ఇంకా తగ్గిపోవొచ్చు. అందుకే మెహరీన్ ని సైతం పక్కన పెట్టేసి... కొత్త హీరోయిన్లతో ఈ ఫ్రాంచైజీని కొనసాగించే అవకాశం ఉంది.