తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో ఇప్పుడు పోలీసుల సోదాలు మొదలెట్టారు. ఇంట్లో బాంబు పెట్టినట్టు ఓ అపరిచితుడు ఫోన్ చేసి బెదిరించడంతో కలకలం రేగింది. ఈ విషయాన్ని రజనీ కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడంతో.. హుటాహుటిన పోలీసులు అప్రమత్తమై రజనీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ అభిమానులు రజనీ ఇంటికి చేరుకుంటున్నారు. అప్పుడప్పుడూ ప్రచారం కోసం కొంతమంది ఆకతాయిలు ఇలాంటి ఫోన్ కాల్స్ చేసి, పోలీసులకు గుబులు పుట్టిస్తుంటారు. ఇది కూడా అలాంటి ఫోన్ కాల్ కావొచ్చన్నది పోలీసుల అభిప్రాయం. కానీ ఛాన్స్ తీసుకోకూడదు కదా. అందుకే సోదాలు ముమ్మరం చేశారు. అయితే ఈ సోదాలో పోలీసులకు ఎలాంటి బాంబూ దొరకలేదని టాక్.