దిల్ రాజు అంటే ఓ బ్రాండ్. టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. అయన ప్రొడ్యూస్ చేసే ఏ సినిమా అయినా దాని లెక్కలు వేరే ఉంటాయి. ప్రమోషన్స్, రిలీజ్ డేట్స్, అన్ని పక్కాగా సిద్ధం చేసుకుని భరిలో దిగుతారు. దిల్ రాజు మూవీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. రీసెంట్ గా ఫ్యామిలీ మాన్ అనే సినిమాతో వచ్చి డిజాస్టర్ మూటగట్టుకున్నారు. విజయ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జోడిగా పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా గ్యారంటీ హిట్ అన్న భరోసాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం జనాల్ని అంతగా మెప్పించలేకపోయింది. దీనితో దిల్ రాజు నష్ఠాలు చవి చూడాల్సి వచ్చింది.
ఫ్యామిలీ స్టార్ మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ తో గందరగోళం ఏర్పడింది. దీనితో థియేటర్ లో ఈ మూవీ చూడటానికి ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు. థియేట్రికల్ రైట్స్ కి పెట్టిన ఖర్చు రాలేదు. ఫ్యామిలీ స్టార్ మూవీతో ఎన్నడూ లేని విధంగా దిల్ రాజుకి భారీ నష్టాలు వచ్చాయి. పోనీ శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఉన్నాయి కదా అనుకున్నారు అంతా. దీన్నే ఇప్పుడు దిల్ రాజు క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడట. విషయం ఏంటి అంటే ఫ్యామిలీ స్టార్ ద్వారా వచ్చిన నష్టాన్నీ భర్తీ చేయటానికి డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే అమౌంట్ మాత్రమే కాకుండా, డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లో రెంటల్ విధానంలో కూడా స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నారట.
ఇప్పటికే కొన్ని OTT సంస్థలు రెంటల్ విధానంలో సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా ఇలా రెంట్ కి పెట్టి బడ్జెట్ రికవరీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వలన ఆడియన్స్ చూడలేదని, OTT లో కచ్చితంగా చూస్తారని దిల్ రాజు గట్టి నమ్మకంతో ఉన్నారట. అన్ని OTT ల్లో ఫ్రీగా సినిమాలు చూసే అవకాశం ఉండగా రెంట్ కి పెట్టిన మూవీ ఎంతమంది చూస్తారనేది సంశయమే.