లేడీస్ టైలర్ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఫ్యాషన్ డీజైనర్ సినిమా జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.
అయితే ఇప్పటికే మణిశర్మ సంగీతం సమకూర్చిన పాటలను ఒక్కొకటిగా విడుదల చేస్తున్నారు. రిలీజ్ అయిన పాటలకి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపధ్యంలో వచ్చే సోమవారం (మే 22) రోజు ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
డైరెక్టర్ వంశీ కూడా ఈ చిత్రం పై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు కూడా ఈ సినిమాని అంచనాలు పెంచుతున్నాయి.
లేడీస్ టైలర్ కి రాబోతున్న ఈ సీక్వెల్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి.