కూతురుగా నటించి ఇప్పుడు భార్యగా నటిస్తుందా?

మరిన్ని వార్తలు

సినిమాల్లో ఒక హీరో పక్కన హీరోయిన్ గా నటించి మళ్ళీ అదే హీరోకి తల్లిగా నటించిన సందర్భాలు ఉంటాయంటూ ప్రేక్షకులు కొంతమంది సినీ విమర్శకులు కామెంట్ చేయడం పరిపాటే.

అయితే దాదాపుగా ఇలాంటి సందర్భమే ఒకటి ఇప్పుడు హిందీ సినిమాలో జరగబోతుంది అని తెలియవస్తుంది. వివరాల్లోకి వెళితే, ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రంలో ఆయన పెద్ద కూతురిగా నటించిన ఫాతిమా ఇప్పుడు ఆయన ప్రముఖ ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం పై చేయబోయే చిత్రంలో ఈమే హీరోయిన్ గా ఎంపిక అయినట్టు సమాచారం.

ఇప్పటికే వీరు ఇద్దరు తగ్స్ అఫ్ హిందూస్తాన్ లో నటిస్తుండగా, ఇప్పుడు మరోచిత్రంలో జంటగా నటించనున్నారు అని తెలియడంతో బాలీవుడ్ లో ఇదో కొత్త చర్చకి దారితీసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS