మెగాస్టార్ చిరంజీవిని ఈ సంవత్సరం 'పద్మ విభూషణ్'తో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరు ఖాతాలో పద్మ భూషణ్ ఉండగా, 2024 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిరుని పద్మ విభూషణ్ వరించింది. 2006లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ ఇచ్చి సత్కరిస్తే, ఇప్పుడు 18 సంవత్సరాల తరువాత 'పద్మ విభూషణ్' వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర్ తర్వాత 'పద్మ విభూషణ్' అందుకున్న రెండవ వ్యక్తి చిరంజీవి కావటం విశేషం.
దేశంలో అత్యున్నత పురస్కారం చిరుని వరించటంతో పలువురు సెలబ్రిటీస్ విషెస్ చెప్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవితో పాటు తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డు గెలిచిన వారందరిని సన్మానించారు. రీసెంట్ గా చిరు తన భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తెలిపారు. 'మళ్లీ కలుస్తా అంటూ తన యూఎస్ వెకేషన్‌పై అప్‌డేట్ ఇచ్చారు. అయితే అంతా ఇది ఫ్యామిలీ వెకేషన్ అని అనుకున్నారు. పైగా వాలంటైన్స్ డే కదా అందుకే భార్యతో కలిసి చిరు ట్రిప్ కి వెళ్లారు అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చిరుకి యూఎస్ లో సన్మానం కోసమే వెళ్లినట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియాలో ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ చేసిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. అమెరికాలో చిరంజీవిని కలిసిన ఆయన చిరుతో దిగిన ఫొటో షేర్ చేస్తూ సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పారు. చిరుకు 'పద్మ విభూషణ్' అవార్డు వచ్చిన సందర్భంగా అమెరికాలో సన్మానం జరిపించబోతున్నట్టు తెలిపారు.