మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందనీ తెలుస్తోంది. దాదాపు 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందనీ సమాచారమ్. బీదర్ సెట్ అట ఇది. బీదర్‌లోనే ఈ షూటింగ్ చేద్దామనుకున్నారట. అయితే, స్థానికంగా షూటింగ్ నిమిత్తం కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో కోట్లు ఖర్చుపెట్టి భారీ సెట్‌ని నిర్మించారు.
హైద్రాబార్ శివార్లలో వేసిన ఈ సెట్ ఇలా అగ్నిప్రమాదానికి గురి కావడంతో 'సైరా' యూనిట్ షాక్‌లో ఉంది. ఇంకా 20 రోజులు పైగా ఈ సెట్లో షూటింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాదంలో సెట్ పూర్తిగా ధ్వంసమైపోయిందట.అయితే, ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా ఈ ప్రమాదం సైరాకి తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ హీరో విజయ్‌సేతుపతి, కన్నడ హీరో సుదీప్, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు. ఆగష్టులో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.