సినీ పరిశ్రమలో అవార్డులు అమ్మకానికి దొరుకుతాయనే అపప్రధ ఒకటుంది. అయితే అన్ని అవార్డులూ అలా ఉండవు. కొన్ని సందర్భాల్లో పలు కారణాలతో అవార్డులు దక్కాల్సినవారికి కాకుండా వేరొకరికి దక్కినప్పుడు ఇలాంటి ఆరోపణలు సాధారణమే. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్, 30 వేల రూపాయలకు అవార్డును కొన్నారట. అది కూడా ఫిలింఫేర్ పురస్కారాన్ని. నాలుగు దశాబ్దాల క్రితం మాట అది. తెలిసీ తెలియని వయసులో ఆ పని చేశానని ఆ తర్వాత ఎప్పుడూ అలాంటి పని చేయలేదని రిషి పూర్ చెప్పారు. తన ఆత్మకథలో ఈ విషయాన్ని ప్రస్తావించారు రిషికపూర్. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఆయన ఆ విషయం ఓ సరదా సందర్భం అనీ, నేను ఈ సందర్భంలో ఆ విషయాన్ని సరదాగా చెప్పానని అన్నారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దనీ కూడా అంటూనే, అన్ని సందర్భాల్లోనూ అవార్డులు అమ్మకానికి దొరకవని, ప్రతిభ ఆధారంగానే దక్కుతాయని అన్నారాయన. రిషికపూర్ ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నప్పటికీ కూడా అవార్డులు అమ్మకానికి దొరుకుతాయనే విషయం ఇప్పుడు ఇంకోసారి ఆయన మాటలతో నిరూపితమయ్యింది. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలో ఉత్తమ నటుల నామినేషన్ జాబితాలో లేకపోవడాన్ని పలువురు తప్పు పట్టారు. అలాగే టాలెంట్ ఉంటే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయనీ, వాటిని డబ్బులు పెట్టి కొనవల్సిన అవసరం ఉండదనీ సోషల్ మీడియాలో విమర్శలు చొప్పించారు.