బుర్రా సాయి మధవ్...టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ రచయితల్లో ఒకరు. కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, మహానటి లాంటి చిత్రాలకు సంభాషణలు అందించారు. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్` కీ ఆయనే డైలాగ్ రైటర్. ఆయన సంభాషణల్లో ఓరకమైన భావోద్వేగం ఉంటుంది. ఎమోషనల్ గా కట్టిపడేసే మాటలు బాగా రాయగలరు. ఇప్పుడు అలాంటి మాటలకు `గమనం` సినిమా ఓ వేదిక అయ్యింది. శ్రియ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఇది. సుజనా రావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ రోజు ట్రైలర్ ఆవిష్కరించారు. ట్రైలర్‌లో విజువల్స్ ఎలా ఉన్నా డైలాగులు మాత్రం ఆకట్టుకున్నాయి.
ఆ మబ్బులు చూడు.. ఎంత అందంగా ఉన్నాయో..?
ఎక్కడికి వెళ్తున్నాయి..?
ఎక్కడి వరకూ వెళ్తాయో వాటికే తెలీదు. అలా వెళ్తూ వెళ్తూ వానై కరిగిపోతాయి. ఒకటి వానైతే, ఇంకోటి ఒంటరిదైపోతుంది.
మర్యాదతో మమ్మల్ని మట్టితో కలుపుతావనుకుంటే ఆ మర్యాదనే మట్టిలో కలిపేశావ్..
నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా నీకూ వినపడదని నాకేం తెలుసు?
దేవుడు తడిసిపోయినాడని ఏడుత్తుండారా ఆయన తయారు చేసిన బొమ్మలని ఆయనే ముంచేత్తుంటే… ఆయన తడిసిపోతున్నాడని ఏడుత్తుండారా?
-లాంటి మంచి డైలాగులు ఈ ట్రైలర్‌లో వినిపించాయి. సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో..? 3 కథల సమాహారం.. ఈగమనం. ముగ్గురు జీవితాల్ని నగరంలో కురిసిన భయంకరమైన వాన ఎలా ముంచెత్తిందో హృద్యంగా చూపించారు. ట్రైలర్ తో ఓ మంచి సినిమా చూడబోతున్నమన్న సంకేతాలు పంపారు.