ఈ వారం బిగ్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న ప్రశ్నకు భిన్నమైన సమాధానాలొస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. గత వారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అవగా, ఇప్పటికే ఆయన స్థానంలో కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ రోజు జబర్దస్త్ అవినాష్ ‘జోకర్’ తరహాలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారంటే, ఇద్దరికి హౌస్ నుంచి బయటకు వెళ్ళేందుకు బిగ్‌బాస్ గేట్లు తెరిచేయనున్నాడన్నమాట.. అని అంతా అనుకోవాల్సి వస్తోంది.
హౌస్‌లో గంగమ్మకి మంచి ఫాలోయింగ్ వుంది. హౌస్ బయట కూడా అదే పరిస్థితి. కానీ, హౌస్‌లో గంగవ్వ ఇమడలేకపోతోంది. మిగతా కంటెస్టెంట్స్ అంతా దాదాపుగా యంగ్‌స్టర్స్ కావడంతో, వారు మాట్లాడుకునే మాటలు గంగవ్వకి అర్థం కావడంలేదు. షోలో ఆమె జస్ట్ ‘అతిది¸ పాత్రకే’ పరిమితమవుతోంది. వయోభారం కూడా ఆమెకు హౌస్‌లో ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తోంది.
‘నేను వుండలేకపోతున్నాను’ అని గంగవ్వ గత వీకెండ్ ఎపిసోడ్‌లోనే నాగ్‌కి విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెల్సిందే. దాంతో, ఈవారం గంగవ్వ ఎలిమినేషన్ తప్పకపోవచ్చనీ, ఆమెతోపాటు మరో మహిళా కంటెస్టెంట్ కూడా ‘ఔట్’ అయిపోవడం ఖాయమని అంటున్నారు. రెండో వికెట్ ఎవరన్నదానిపై బహుశా రేపు స్పష్ట వచ్చే అవకాశం వుంది.