బిగ్‌బాస్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన గీతా మాధురి ఈ సీజన్‌కి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేర్కొనవచ్చు. అయినా ఇది బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు. ఊహించింది అయితే అస్సలు జరగకపోవచ్చు.
ఆ సంగతి అటుంచితే, తాజా టాస్క్ మర్డర్ మిస్టరీకి సంబంధించి గీత మర్డరర్ క్యారెక్టర్ పోషిస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌లో ఒకరికి కోపం తెప్పించాలని బిగ్‌బాస్ చెప్పిన రూల్‌లో ఒకటి. ఆ రూల్‌ని గీత ఇంకెవరి మీద ప్రయోగిస్తుంది. అవును మీ గెస్ కరెక్టే. కౌషల్ మీదే ప్రయోగించింది. అయితే ఈ సారి గీత శృతి మించేసింది. గత కొన్ని వారాలుగా కౌషల్‌నే టార్గెట్ చేసుకుని గేమ్ ప్లే చేస్తున్న గీత ఈ సారి టాస్క్‌ని అడ్డం పెట్టుకుని, తన మనసులోని మాటల్ని నిజంగానే బయట పెట్టేసింది. కౌషల్‌పై తన అభిప్రాయాన్ని జెన్యూన్‌గా కక్కేసింది.
ఈ మాట స్వయంగా కెమెరా ముందుకొచ్చి తానే చెప్పడం వివాదాలకు నెలవైంది. పోనీలే టాస్క్‌లో భాగమే కదా అని సరిపెట్టుకోవడానికి లేకుండా పోయింది. బిగ్‌బాస్ షో చూస్తున్న వారికి గీత బిహేవియర్ నచ్చదు. అందులోనూ కౌషల్ ఆర్మీ నుండి తప్పించుకోవడం ఇక గీత వల్ల కాదనిపిస్తోంది. కేవలం ఇది టాస్క్‌లో భాగమే అని ఊరుకుంటే సరిపోయేది. ఇదంతా జెన్యూన్‌గా నా మనసులో కౌషల్ పట్ల తన ఒపీనియన్ అని చెప్పడంతో గీత చాలా చాలా పెద్ద తప్పు చేసేసింది.
ఇది కేవలం గేమ్ మాత్రమే. గేమ్ ఫినిష్ అయ్యాక, గీత బయటికి రావడం తప్పదు. కౌషల్, గీత ఇద్దరూ సెలబ్రిటీలే. సో ఏదో ఒక రకంగా బయట కలవక తప్పదు. అలాంటిది, గేమ్‌ని గేమ్‌గా తీసుకోకుండా, పర్సనల్‌గా నెగిటివ్‌గా తీసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తోంది. చూడాలి మరి, అనుకోకుండానే జరిగిందో, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందో తెలీదు కానీ, ఈ హఠాత్పరిణామం బిగ్‌బాస్‌ని ఎలా మలుపు తిప్పుతుందో. చూసే ఆడియన్స్ మనసులో గీత పరిస్థితి ఎలా ఉండబోతోందో..!