'గని' సినిమా చూసిన ప్రేక్షకుల మాట ఒక్కటే. 'కథ చాలా పాతగా వుంది. కొత్త సీన్లే లేవు. రొటీన్ గా వుంది'' మెజార్టీ ప్రేక్షకులు ఇదే కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ లో వాస్తవం వుంది. గని కథ పరమ రొటీన్ గా వుంది. అసలు ఇంత పాత కథ మెగా కాంపౌండ్ లో ఎలా పాసైయిందనేది ఇప్పుడు ఫిల్మ్ టాపిక్ గా మారింది. అల్లు అరవింద్ తనయుడు బాబీ ఈ చిత్రానికి ఒక నిర్మాత. అల్లు బాబీ కంపనీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. చేసిన తొలి సినిమానే ఇంత వీక్ కంటెంట్ ని ఎలా తీసుకున్నారు ? అల్లు అరవింద్ ఎలా చూస్తూ వుండిపోయారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
నిజానికి ఈ కథ అరవింద్ కి కూడా చెప్పారు. కథ విన్న అరవింద్ .. పెద్ద ఆసక్తి కనబరచలేదు. మరో కథని చేసుకోవచ్చు కదా అనే సలహా కూడా ఇచ్చారట. కానీ బాబీ మాత్రం ' కథ అలా అనిపించినా ట్రీట్మెంట్ మొత్తం కొత్తగా ఉంటుందని అరవింద్ ని ఒప్పించారట. తర్వాత అరవింద్ కూడా పెద్దగా ఇన్వాల్ కాలేదు. తీరా రిజల్ట్ చూశాక .. కథే కాదు ట్రీట్మెంట్ అంత కంటే పాతగా వుందని పెదవి విరిచారు ప్రేక్షకులు. ఏదేమైనా కంటెంట్ వున్న సినిమాలు చేయాలని ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టిన బాబీ .. తొలి సినిమాగా ఇలాంటి ప్రోడక్ట్ ఇవ్వడం నిరాశపరిచింది.