>>హాయ్ సంకల్ప్..
హాయ్..
>>అసలు ఘాజీ ఎలా కథ ఎలా పుట్టింది?
నేను 2012 నవంబర్ 23న అన్నవరం వెళ్ళాను. అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్ తిరిగి రావాల్సిన ట్రైన్ లేట్ అవ్వడంతో అనుకోకుండా వైజాగ్ వెళ్ళాను. అక్కడే RK బీచ్ లోని సబ్ మెరైన్ ని మొదటిసారి చూశాను. అప్పుడు పుట్టిందే ఈ కథ.
>>ఘాజీని ముందు ఇండిపెండెంట్ YouTube సినిమాగా చేద్దామనుకున్నారట? నిజమేనా?
(నవ్వుతూ) అవును. నేను ఘాజీని లిమిటెడ్ బడ్జెట్ తోయూట్యూబ్ లో పెడదామనే ఆలోచనతోనే మొదలుపెట్టాను. దాని కోసం నేనునా ప్రొడక్షన్ డిజైనర్ శివంని (కో అంటే కోటి సినిమాకి కలిసి వర్క్ చేశాం) తీసుకొని వైజాగ్ వెళ్లి సబ్ మెరైన్ ని చూసి వచ్చాం. ఆ తరువాత హైదరాబాద్ కి వచ్చి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక కమర్షియల్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో సెట్ వేశాం. దీనికి నేను పెట్టుకున్న బడ్జెట్ రూ. 20లక్షలు, ఈ డబ్బులు కూడా నేను నా ఫ్యామిలీ &ఫ్రెండ్స్ నుండి సమకూర్చుకున్నాను.
>>మరి పీవిపీ, నిరంజన్ రెడ్డిలని ఎందుకు కలిశారు?
Actually మేము సమకూర్చుకున్న బడ్జెట్ సెట్ వేయడానికే సరిపోయింది! We ran out of money &ఇంతలో అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారిని (మ్యాట్నీ entertainment సంస్థ ప్రొడ్యూసర్ కూడా) కలవడం, ఆయన ద్వారానే పీవిపీ గారిని ఊపిరి సినిమా టైంలో కలిశాను. కథ నచ్చడంతో ఆయన ఈ సినిమాని ఈ రేంజ్ కి తీసుకెళ్ళటంలో ముందుoడి నడిపించారు. అసలు వాళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా YouTube లో మిగిలిపోయేదేమో!
>>ఫస్ట్ ఫిలింకి ఇలాంటి సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడానికి గల కారణం?
నేను ఆస్ట్రేలియాలో చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక మాట చెప్పారు- “బీ ద ఫస్ట్ ఆర్ బీ ద బెస్ట్”. అందుకే తోలి సబ్ మెరైన్ సినిమా చేశా ఇకముందు కుడా ఫస్ట్ ఆర్ బెస్ట్ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాను.
>>ఇంతకి రాణాని ఎలా ఒప్పించారు?
నేను తనని కలిసి కధ చెప్పకముందే తను ఘాజీ స్క్రిప్ట్ చదివేశాడు. ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారిని ద్వారా నా సినిమా కాన్సెప్ట్ నాకన్నా ముందే రాణాని చేరింది. తరువాత నేను కలిసి narration ఇచ్చాక ఆఫీషియల్ గా ఒకే చెప్పారు.అసలు ముందు రాస్కున్నపుడు రాణా క్యారెక్టర్ వయసు 45 సం||లు అనుకున్నాం, కానీ తర్వాత ఆయన లుక్, ఇమేజ్ కి సరిపోయేటట్టు చిన్న చిన్న మార్పులు చేశాం.
స్క్రిప్ట్ narrate చేస్తునపుడు కన్నా 3 నెలల్లో ఈ సినిమా కోసం ఆయన బరువు (బాహుబలి 2 కోసం పెరిగారు) తగ్గి తనని తాను మలుచుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయా, నాకు అంత dedicated హీరో దొరికినందుకు ఆనందపడ్డా!
>>సినిమాటోగ్రాఫర్ మదీఈ సినిమాకిఎలా హెల్ప్ అయ్యారు?
నేను మదీ గారిని పీవిపీ ఆఫీస్ లో మొదటిసారిగా కలిసాను. కారు లో డ్రైవ్ కి వెళ్తూ narration ఇచ్చాను. వెంటనే remuneration గురించి కూడా ఆలోచించకుండా కేవలం ఈ కథ చెప్పాలి అనే తపన తో పని చేశారు. తనకి ఈ కథ ఎంత నచ్చిందంటే ఖర్చుకి వెనుకాడకుండాUS నుండి స్పెషల్ గా లైట్స్ కూడా తెప్పించారు షూటింగ్ కోసం. తన పనితనం మనం విజువల్స్ రూపంలో స్క్రీన్ పైన చూసి ఆశ్చర్యపోవాల్సిందే.
>>సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉపయోగపడింది?
అసలు ఈ స్క్రిప్ట్ మొదట చదివింది శ్రీకర్ ప్రసాద్ గారే, నేను రాసిన స్క్రిప్ట్ కి ఫైనల్ రూపం ఇవ్వడంలో శ్రీకర్ గారి హెల్ప్ మరువలేనిది. ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ కే ని, అలాగే సౌండ్ డిజైనేర్ తపస్ పేర్లని సజెస్ట్ చేశారు. ఒక సం|| క్రితం ఈ కథ తో కలిసినపుడు ఆయన ఇది ప్రొడ్యూసర్స్ దొరికితేనే చెయ్యి అని చెప్పారు, కానీ నేను మొండిగా చెయ్యటం మొదలుపెట్టేశా! ఇప్పుడు అర్థమయ్యింది ఆయన suggestion value.
>>బాలీవుడ్ యాక్టర్స్ కేకే మీనన్, అతుల్ కులకర్ణి ల గురించి?
వీరిద్దరి యాక్టింగ్ చూసి మీరు ఫిదా అయిపోతారు. ఇది మాత్రం గ్యారంటీ. సినిమా చూశాక మీరే చెప్తారు. national stars అయ్యుండి కూడా డైలాగ్స్ రైటింగ్ లో వారి సాయం మరువలేనిది.
>>మీ డైలాగ్ రైటర్స్ గురించి...
నేను స్క్రిప్ట్ ఇంగ్లీష్ లో రాసుకున్నా. తెలుగు కి ప్రముఖ రచయత, దర్శకులు గుణ్ణం గంగరాజు గారు పనిచేశారు అలాగే హిందీ వెర్షన్ కి అబ్బాస్ అనే టాలెంటెడ్ రైటర్ పనిచేశాడు. ఈ సినిమాని వీరి మాటలతో ఇంకొక స్థాయికి తీసుకెళ్ళారు.
>>మొదటసారి సినిమా కదా, మీరు అనుకున్నది అనుకున్నట్టు ఎంత వరకు తీయగాలిగారు?
స్క్రిప్ట్ పరంగా ఫస్ట్ హాఫ్ లో మార్పులు మినహా ఏది మారలేదు. నిజంగా చెప్పాలంటే నేను అనుకున్నదానికంటే 100% బెటర్ గా, రిచ్ గా తీయగలిగాను అనే సంతృప్తి ఉంది నాకు!
>>తెలుగు లో ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా ఆడతాయి అనుకుంటున్నారా?
నేను ఆ లెక్కలు వేసిఈ సినిమాని మొదలుపెట్టలేదు. అయితే నేను ఈ సమయంలో ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి అలాగే పీవిపీ గార్లకి నా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు కూడా లెక్కలు కాకుండా ఒక్క గొప్ప సినిమా ఇవ్వాలన్న ధ్యేయంతో డబ్బు పెట్టారు.అయిన ఇది కూడా కమర్షియల్ సినిమానే. ఇందులో కూడా ప్రేక్షకులను entertain చేసే selling ఎలెమెంట్స్ అన్నీ ఉన్నాయ్. కమర్షియల్ సినిమా అంటే ఒక ఫైట్, కామెడీ, item సాంగ్ అనే కాకుండా మంచి సినిమా ని మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ encourage చేశారు, మా సినిమానీ చేస్తారు అనే నమ్మకం ఉంది.
>>ఈ సినిమాలో ఏమైనా హాలీవుడ్ ఫిలిమ్ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా?
సబ్ మెరైన్ మరియూ underwater వార్ genre లో హాలీవుడ్, రష్యన్& కొన్ని చైనీస్ సినిమాలు ఉన్నాయ్ కానీ మన ఇండియా లో లేవు. so, కొన్ని references తీసుకున్నాను,కొన్ని సినిమాల నుండి స్ఫూర్తి పొందానుఅయితే కాపీ కొట్టలేదు.
>>ఫిలింమేకింగ్ కోర్సు ఏదైనా చేశారా?
నేను ఇక్కడ CVR ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్సు చదివాను తరువాత ఎంబీయే కోసం ఆస్ట్రేలియా వెళ్ళాను. అయితే అక్కడ ఒక సెమిస్టర్ అయిన తరువాత ఎంబీయే మీద ఇంట్రెస్ట్ లేక అదే యూనివర్సిటీలో మాస్టర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో పీజీ చేశాను. అయితే ఈ విషయం నేను ఇండియాకి వచ్చిన తరువాత తెలిసి మా పేరెంట్స్ కంగారుపడ్డారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ముందుకి వెళ్ళడం కష్టం అని వాళ్ళ భయం.
>>ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ ఎలా ఉంది?
నేను ముందుగా ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్ స్టూడియో పెట్టాను. కొన్ని ఇండిపెండెంట్ సినిమాలకి అలాగే చిన్న బడ్జెట్ సినిమాలకి వర్క్ చేశాను. ఆ టైంలోనే సిజి లో స్టొరీ బోర్డు చేయడం నేర్చుకున్నాను అదే ఘాజీ సినిమాకి బాగా ఉపయోగపడింది. నేను కూడాకొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసాను బట్ అవి అంతగా క్లారిటీ లేకపోవడంతో యు ట్యూబ్ నుండి తేసేసా.
>>షార్ట్ ఫిలిమ్స్ తీసేవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి?
ఒకటే చెప్తాను. If you believe in something, go for it.
>>మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేస్తాను.
>>మేము ఘాజి గురించి ఎదురుచూస్తున్నాం మరి మీరు?
(నవ్వుతూ) నేనూ థియేటర్ లో జనాలతో చూడాలని ఉంది. అయితే నా inspiration మణిరత్నం గారు.. ఘాజినిఆయనకి చూపించమని మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేశాను.Looking forward to his response. అదే గనుక జరిగితే ఇ విల్ బీ వేరీ మచ్ హ్యాపీ..
గుడ్ లక్ సంకల్ప్!
థ్యాంక్ యూ!