గ్లామ్‌షాట్‌: వంపు సొంపుల చీర‘కట్టు’బాటు.!

By Inkmantra - February 28, 2020 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

‘హిప్పీ’ సినిమాలో గ్లామరస్‌గా కనిపించి కుర్రోళ్ల మనసుల్ని దోచేసిన ముద్దుగుమ్మ దిగంగనా సూర్యవంశీ, ఇప్పుడు ఇదిగో సోషల్‌ మీడియానీ హీటెక్కించేస్తోందిలా. హిందీలో ‘జలేబీ’ తదితర చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కార్తికేయ నటించిన ‘హిప్పీ’తో డెబ్యూ చేసింది. తొలి సినిమాకే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకోవడంతో పాపకి అవకాశాలు బాగానే క్యూ కడుతున్నాయి. ‘వలయం’ అనే చిన్న సినిమాలో నటించింది. తదుపరి గోపీచంద్‌ ` తమన్నా జంటగా తెరకెక్కుతోన్న ‘సీటీమార్‌’లో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. తాజాగా చీరకట్టులో వయ్యారాలొలికిస్తూ ఓ ఫోటోకి పోజిచ్చింది. ఈ ఫోటోని నెట్టింట్లో పోస్ట్‌ చేసి, కుర్రకారు గుండెకు చిల్లు పెట్టింది.

నిజానికి చీరకట్టులోని అందం ఏ డ్రస్‌కి వస్తుంది చెప్పండి. ఎక్కడ దాచాలో ఎక్కడా దోచాలో చీరకట్టుకు తెలిసినంతగా మరే కాస్ట్యూమ్‌కి తెలియదంటే అతిశయోక్తి అనిపించదేమో. అందుకే ఈ పాప ఇలా శారీలో దర్శనమిచ్చింది. రెడ్‌ కలర్‌ శారీకి కాంట్రాస్ట్‌ పింక్‌ స్లీవ్‌లెస్‌ డిజైనర్‌ బ్లౌజ్‌ ధరించి, కుర్రోళ్ల గుండెల్లో చిచ్చు పెట్టి చంపేస్తోంది. ఆ నాభి సౌందర్యం చూశారుగా సెక్సప్పీల్‌ కెవ్వుకేక. ఇక, ఓన్లీ యాక్టింగే కాదు, పాపలో చాలా టాలెంట్స్‌ ఉన్నాయండోయ్‌. ఓ మంచి సింగర్‌, ఓ మంచి రైటర్‌ దాగున్నారట ఈ భామలో. అయితే, ఇంతవరకూ ఆ టాలెంట్స్‌ బయటికి తెచ్చే అవకాశం రాలేదు కానీ, త్వరలో వస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS