‘నాగిని’ సీరియల్‌తో బుల్లితెరపై బుసలు కొట్టిన గ్లామర్ చిన్నది మౌనీరాయ్, ఇప్పుడు వెండితెరపై సెగలు పుట్టిస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హీరోయిన్గా బిజీ అయిపోయింది. ఓ పక్క హీరోయిన్గా సినిమాలు చేస్తూనే, అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్‌లోనూ తన గ్లామర్‌తో కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతకన్నా ముందు అంతర్జాలాన్ని తన హాట్ హాట్ సొగసుల్తో నిషాలో ముంచేస్తోంది. లేటెస్ట్ పిక్ చూస్తున్నారుగా. కనుచూపు మేరలో సముద్రమే కనిపిస్తోంది.
ఆ నడి సముద్రంలో ఈ అందాల భామ రిలాక్స్డ్గా కూర్చొని ఫ్రూట్ జ్యూస్ లాగించేస్తోంది. జ్యూస్‌లోని తీయదనం సంగతి పాపకే తెలుసు కానీ, ఆమె అందాల్లోని మత్తు మాత్రం పిక్ చూస్తున్న అందరికీ తెలుస్తోంది. ఆమె ధరించిన నెట్ ప్యాటర్న్డ్ బికినీ మౌనీ రాయ్ అందాల్ని ట్రాన్స్పరెంట్ వేలో మొత్తం ఎలివేట్ చేస్తోంది. ఫేస్ సైడ్ టర్నింగ్ ఇచ్చింది కానీ, అందాల్ని మాత్రం స్ట్రెయిట్ యాంగిల్లోనే ప్రొజెక్ట్ చేస్తోంది. అందుకే ఈ పోజుకి నెటిజన్స్ నుండి హాట్ హాట్ కామెంట్స్ పోటెత్తేస్తున్నాయి. ఇక పాప ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’లో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ‘మొగల్’ అను మరో ఫాంటసీ మూవీలోనూ మౌనీరాయ్ నటిస్తోంది.