మూవీ రివ్యూ & రేటింగ్ 'గుడ్ లక్ సఖి'

మరిన్ని వార్తలు

నటీనటులు: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు
దర్శకత్వం : నగేష్ కుకునూర్
నిర్మాత: సుధీర్ చంద్ర ప‌దిరి
సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్


రేటింగ్: 2/5


'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ జాతకం మారిపోయింది. అప్పటివరకూ సగటు హీరోయిన్ లా వున్న కీర్తి .. ఒక్కసారి స్టార్ డమ్ తో పాటు నటిగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేసుకుంది. ఒకపక్క స్టార్‌ హీరోలతో నటిస్తూ.. మరో పక్క లేడి ఓరియెంటెడ్‌ సినిమాలతో మెప్పిస్తోంది. తాజాగా కీర్తి మరో లేడి ఓరియెంటెడ్‌ మూవీ ‘గుడ్‌ లక్‌ సఖి’ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం రివ్యూలోకి వెళితే.. 


కథ:


మాజీ కల్నల్ (జగపతిబాబు) తన గ్రామాల్లోని ప్రతిభ వున్న వారికి గుర్తించి వారిని జాతీయ స్థాయి ఛాంపియన్లు గా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకుంటాడు. అదే ఊర్లో సఖి (కీర్తి సురేష్ ) వుంటుంది. సఖి బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్. ఆమెని అంతా బ్యాడ్ లక్ సఖీ అని పిలుస్తుంటారు. సఖిలో షూటింగ్ ప్రతిభని గుర్తించిన కల్నల్ ఆమెను జాతీయ స్థాయి పోటీలకు సిద్దం చేస్తాడు. మరి సఖి షూటర్ గా విజయం సాధించిందా ? సఖి, రామారావు ( ఆది పినిశెట్టి)ల ప్రేమ ఏ తీరాలకు చేరింది ? అనేది వెండితెరపై చూడాలి.


విశ్లేషణ:


టాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామాలు ఈ మధ్య కాలంలో బాగానే జోరందుకున్నాయి. ఇటివలే నాగశౌర్య లక్ష్యతో వచ్చాడు. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామాలు తెరపై చూపించే టెక్నిక్ మాత్రం అందుకోవడం ఎక్కడో తడబాటు కనిపిస్తుంది. ఇలాంటి చిత్రాల్లో చివర్లో ప్రధాన పాత్రే గెలుస్తుందని ప్రేక్షకులకు ముందే తెలుసు. కానీ చివరి వరకూ ప్రేక్షకులని థియేటర్ లో కూర్చోబెట్టే స్క్రీన్ ప్లేయ్ బిగి కావాలి. గుడ్ లక్ సఖిలో అదే లోపించింది. ఆరంభం నుంచి క్లైమాక్స్ ఘట్టం వరకూ ఏవో సీన్లు నడుస్తున్నాయనే మాటేగానీ కథలోకి ప్రేక్షకుడిని ఇన్వాల్ చేయలేకపోయాడు దర్శకుడు.


దర్శకుడు నాగేష్ కుకునూర్ విమర్శల ప్రసంసలు అందుకునే సినిమాలు తీశాడు. గతంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర రాణించకపోయిన మంచి సినిమాలనే కితాబు అందుకున్నాయి. అయితే గుడ్ లక్ సఖి విషయానికి వచ్చేసరి ఇటు వాణిజ్య విలువలు జోడించలేక అటు కళాత్మక శైలిలో మలచలేని తడబాడు కనిపిస్తుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లానే గుడ్ లక్ సఖి ప్లాట్ ని సెట్ చేసుకున్నాడు దర్శకుడు. అయితే అవి డ్రామాని పండించే ఎలిమెంట్స్ కాలేకపోయాయి. 


కధనం సినిమా ఆరంభం నుంచే కధనం ప్రేక్షకుడి ఊహకి అందిపోతుంది. ప్రతి కథకు ఎమోషనల్ కనెక్షన్ వుండాలి. అయితే పాత్రల మధ్య సంఘర్షణ ఉన్నప్పుడే   ఎమోషనల్ కనెక్షన్ వస్తుంది. గుడ్ లక్ సఖిలో ఆ ఎమోషనల్ కనెక్షన్ కొరవడింది. మధ్యలో ఏజ్ గ్యాప్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే కథని సాగదీయడం తప్పితే దిని ద్వారా సినిమాకి ఎలాంటి లాభం చేకూరలేదు. టోటల్ గా గుడ్ లక్ సఖి చాలా చప్పగా సాగుతుంది.


నటీనటులు:


కీర్తి సురేష్ చాలా సహజంగా కనిపించింది. పల్లెటూరి గడుసు పిల్లగా అదే సమయంలో స్పోర్ట్స్ పర్శన్ గా ఆమె లుక్స్ ఆకట్టుకుంటాయి. చిత్తూరు యాస పలికిన విధానం బావుంది. కోచ్ గా జగపతిబాబు పాత్ర ఆకట్టుకుంటుంది. ఆయన చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రంగస్థల నటుడిగా ఆదిపినిశెట్టి పాత్ర బావుంది. రాహుల్ రామకృష్ణతో పాటు మిగతా పాత్రలు పరిధిమేర గా చేశారు. 


టెక్నికల్ గా :


దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఒక్కపాటైన రిజిస్టర్ అవుతుంది. బ్యాడ్ లక్ .. ఈ సినిమాలో ఒక్క పాట కూడా రిజిస్టర్ కాదు. నేపధ్య సంగీతం కూడా సోసోగానే వుంటుంది.  సినిమాటోగ్రఫీ ఓకే. కొన్ని చోట్ల డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు. నిర్మాణ విలువలు ఓకే. 


ప్లస్ పాయింట్స్ 


కీర్తి సురేష్ 
పల్లెటూరి నేపధ్యం 


మైనస్ పాయింట్స్


ఫ్లాట్ నేరేషన్, రొటీన్ డ్రామా 
బోరింగ్ స్క్రీన్ ప్లేయ్ 
పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : బ్యాడ్ లక్ కీర్తి


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS