ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలని పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది. ధరలని తగ్గిస్తూ గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 35ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు. ఈ వేసవికి భారీ సినిమాలు విడుదలకు సిద్దమౌతున్నాయి. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్ 3.. సినిమాలు థియేటర్ లో సందడి చేయడానికి సిద్దంగా వున్నాయి. ఈ సినిమాలన్నీ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో కోసం ఎదురుచూశాయి. తగ్గించిన ధరలతో ఈ సినిమాలకి కిట్టుబాటు కాదు.
తగ్గింపు ధరల సమయంలో వచ్చిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్, భీమ్లా నాయక్ సినిమాలు నష్టపోయాయి. చాలా తక్కువ వసుళ్ళూ వచ్చాయి. ధరలు పెంచి వుంటే కలెక్షన్స్ లో స్పష్టమైన తేడా వుండేది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం .. ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు కూడా ఇండస్ట్రీ ఆశించిన స్థాయిలో లేకపోయిన తగ్గించిన ధరలు కంటే చాలారెట్లు బెటర్. ధరలు పెంపు నిర్ణయం భీమ్లా నాయక్ సమయంలో తీసుకొనివుంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఏదేమైననప్పటికి పెంచిన ధరలతో ప్రస్తుతం నిర్మాతలు కొంత తృప్తిగానే వున్నారు. వేసవిలో వస్తున్న పెద్ద సినిమాలకి ఈ ధరలు ఉపసమనం కలిగిస్తాయనే చెప్పాలి.