ఒకప్పుడు సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తే ఆ లెక్కే వేరు. కానీ ఇప్పుడలా కాదు, ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. స్టార్‌డమ్ కన్నా కంటెన్ట్‌కీ, కొత్తదనానికే ఆడియన్స్ పట్టం కడుతున్నారు. స్టార్‌డమ్‌ని అస్సలు లెక్క చేయడం లేదు. అందుకే కొత్త నటీనటులతో తెరకెక్కిన చిన్న సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అందుకుంటున్నాయి. అంటే సింపుల్‌గా కంటెన్ట్ ఉంటే కటౌట్‌తో సంబంధం లేదనేస్తున్నారంతే. అందుకే ఆరడుగుల ఆజానుబాహుడు, యాక్షన్ హీరో గోపీచంద్ ఇలా రూటు మార్చేశాడు.
కొత్త కథలకు ప్రాధాన్యమిస్తూ, కొత్త డైరెక్టర్స్‌ని ప్రోత్సహించాలనుకుంటున్నాడు. ఇందులో ఆయన స్వార్ధం కూడా లేకపోలేదులెండి. ఈ మధ్య గోపీచంద్ ఖాతాలో ఓ మోస్తరు హిట్ ఒక్కటి కూడా పడలేదు. దాంతో గోపీచంద్ డిసైడ్ అయ్యాడట. సీనియర్ డైరెక్టర్స్‌లో కన్నా, డెబ్యూ డైరెక్టర్స్‌లోనే విషయం ఎక్కువ ఉంటోందనీ, తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్స్ కొట్టి సత్తా చాటారు ఈ మధ్య చాలా మంది కొత్త డైరెక్టర్లు.
అలాగే గోపీచంద్ కూడా తిరు సుబ్రహ్మణ్యం అనే ఓ కొత్త డైరెక్టర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. తిరు సుబ్రహ్మణ్యం చెప్పిన కథ గోపీచంద్‌కి బాగా నచ్చేసిందట. వెంటనే ఓకే చేశాడట. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించనున్నారు. మొత్తానికి గోపీచంద్ తీసుకున్న ఈ కొత్త డెసిషన్ ఆయన కెరీర్‌కి కొంతైనా కొత్తదనం చూపిస్తుందేమో చూడాలిక.