మారుతి సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే. ఏ కాన్సప్ట్ పట్టుకున్న దాన్ని పైసా వసూల్ గా తీస్తారు మారుతి. మతి మరుపుతో భలే భలే మగాడివో తీశారు. ఇది సూపర్ హిట్. అతి శుభ్రత పాటించే మహానుబావుడిని చూపించారు. ఇదీ హిట్టే. ఇప్పుడు ఆయన ఏకంగా కమర్షియల్ కాన్సప్ట్ నే పట్టుకున్నారు. ప్రస్తుతం మారుతి, గోపీచంద్ తో ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను ‘పక్కా కమర్షియల్’గా ఖరారు చేశారు.
టైటిల్ లోనే కధపై క్లారిటీ ఇచ్చారు. ఒక వ్యక్తి పూర్తి కమర్షియల్ గా ఆలోచిస్తే ఎలా వుంటుందో చెప్పే కధతో ఈ సినిమా వస్తుందనే అర్ధం వుంది ఈ టైటిల్ లో. మారుతి సినిమా అంటే వినోదం గ్యారెంటీ. ఈసారి గోపించద్ తో వినోదం పడించడానికి రెడీ అవుతున్నారు. మార్చి 5 నుంచి షూట్ ప్రారంభించి.. ఆక్టోబరు 1వ తేదిన విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌బిజోయ్ సంగీతం మ్యూజిక్.