ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్న గోపీచంద్

మరిన్ని వార్తలు

ఈమధ్య కాలంలో కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులు చూస్తున్న గోపీచంద్ ఇప్పుడు తాజాగా ఒక కొత్త ప్రాజెక్ట్ కి ఒకే చెప్పేశాడు.

వివరాల్లోకి వెళితే, కొత్త దర్శకుడు చక్రవర్తి (చక్రి) చెప్పిన కథకు ఫ్లాట్ అయిపోయిన గోపీచంద్ వెంటనే ఈ చిత్రానికి ఒకే చెప్పేశాడు అని తెలిసింది. ఇక ఈ చిత్రానికి నిర్మాత రామ్ మోహన్ వ్యవహరిస్తుండగా ఈ చిత్రానికి భారీ ఎత్తున నిర్మించాలని నిర్మాత భావిస్తున్నాడట.

ఇక ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించి డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారట. ఇప్పటికే ఫ్లాప్స్ తో సతమవుతున్న గోపీచంద్ కి ఈ చిత్రం పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం..

తను నటించి విడుదలకి సిద్ధంగా ఉన్న ఆక్సిజన్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS