రామయ్యా వస్తావయ్యా సినిమా గుర్తుంది కదా? చాలా అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయిన సినిమా అది. అయితే అందులో ఓ డైలాగ్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ గుర్తుంటుంది.
``ఎవడు పడితే వాడు బుడ్డోడు... బుడ్డోడు అంటే.. గుడ్డలూడదీసి కొడతా.
అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి. లేదా నా అభిమానై ఉండాలి``
అనే డైలాగ్ అది. ఈ డైలాగ్ రిలీజ్ కి ముందు పిచ్చ పిచ్చగా అభిమానులకు నచ్చేసింది. ఎందుకంటే అప్పట్లో చాలామంది ఎన్టీఆర్ ని బుడ్డోడు.. అనే పిలిచేవారు. ఈ డైలాగ్ తో వాళ్లకు కౌంటర్ ఇచ్చినట్టైంది.
సరిగ్గా ఇలాంటి డైలాగ్ ఇప్పుడు `సిటీమార్`లో వినిపిస్తోంది. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తమన్నా నాయిక. సంపత్ నంది దర్శకుడు. ఈ టీజర్ ఈరోజు విడులైంది. ఇందులో...
“నన్నెవడైనా అలా పిలవాటంటే ఒకటి నా ఇంట్లో వాళ్లు పిలవాలి. లేదంటే నా పక్కనున్న స్నేహితులు పిలవాలి. ఎవడు పడితే వాడు పిలిస్తే… వాడి కూత ఆగిపోద్ది“ అనే డైలాగ్ రాశాడు సంపత్ నంది. ఇది అచ్చంగా.. బుడ్డోడు డైలాగ్ లానే ఉంది అంటున్నారంతా. మరి.. ఇది కావాలని వాడాడా? లేదంటే ఆ సందర్భానికి ఆ డైలాగ్ సూటయ్యిందా? అనేది తెలియాలంటే... సిటీమార్ రావాల్సిందే.