బాహుబ‌లి రేంజ్‌లో రానా సినిమా

By iQlikMovies - June 01, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

రానా - గుణ‌శేఖ‌ర్ కాంబినేష‌న్లో ఓ సినిమా రావాల్సింది. `హిర‌ణ్య క‌శ్య‌ప‌` అనే పేరు కూడా ప్ర‌క‌టించారు. ఈ ప్రాజెక్టు ప్ర‌క‌టించి ఏడాది దాటేసినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అడుగు కూడా ప‌డ‌లేదు. దాంతో... ఈ సినిమా ఆగిపోయింద‌ని, బ‌డ్జెట్ ఎక్కువ‌వ్వ‌డం వ‌ల్ల ఈ ప్రాజెక్టు ప‌క్క‌న పెట్టేశార‌ని చెప్పుకున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోలేదు. త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈ విష‌య‌మై ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ క్లారిటీ ఇచ్చేశాడు. గ‌త మూడేళ్లుగా హిర‌ణ్య క‌శ్య‌ప ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నామ‌ని, త్వ‌ర‌లోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని గుణశేఖ‌ర్ ప్ర‌క‌టించాడు.

 

ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో క‌ల‌సి సురేష్ ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. దాదాపు 200 కోట్ల పెట్టుబ‌డి అవ‌స‌రం ఏర్ప‌డ‌నున్న‌ద‌ని టాక్‌. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టీన‌టులు సైతం క‌నిపిస్తార‌ని, దేశ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని గుణ‌శేఖ‌ర్ భావిస్తున్నారు. బాహుబ‌లి రేంజులో ఈ సినిమాకి ప‌బ్లిసిటీ ఇచ్చి, అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాల‌న్న‌ది గుణ శేఖ‌ర్ ప్లాన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS