ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబోలో వచ్చిన హనుమమాన్ మూవీ, భారీ సక్సెస్ ను అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా , థియేటర్స్ వివాదాలతో, సంక్రాతి బరిలో రిలీజైన ఈ మూవీలో సూపర్ హీరో కథను ఇతిహాసంతో ముడిపెట్టి, నేటివిటీని చూపించడంలో చిత్రబృందం విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య రిలీజైన గుంటూరు కారం ఆడియన్స్ ని నిరుత్సాహ పరచగా, ‘హనుమాన్’ సినిమాలోని విజువల్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
25 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజు 21 కోట్లు వసూల్ చేసినట్టు, సినీ విశ్లేషకుల అంచనా. హనుమాన్ కేవలం 4 థియేటర్స్ తో రిలీజై, ఇప్పుడు ఒక్కొక్కటిగా థియేటర్స్ సంఖ్య పెంచుకుంటోంది. ఏఎంబి మాల్ లో కూడా గుంటూరు కారం మూవీని హానుమాన్ రీప్లేస్ చేయటం గమనార్హం. ఇంకా థియేటర్స్ పెరగనున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి నార్త్‌లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని “హనుమాన్” మేకర్స్ థియేటర్లలో రివీల్ చేశారు. ఈ సీక్వెల్ కు “జై హనుమాన్” అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. “హనుమాన్” క్లైమాక్స్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ 2025లో “జై హనుమాన్” మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న రాక్షసులను ఎదుర్కోవడానికి హనుమంతుడు ఎలాంటి సాహసాలు చేశాడు అనే విషయాన్ని సీక్వెల్లో చూపించబోతున్నారు. జై హానుమాన్ కూడా భారీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ , తో “హనుమాన్”ను మించిన సూపర్ పవర్స్ తో తేజ సజ్జ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.