పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎప్పుడో రావాల్సిన సినిమా. అయితే పవన్ రాజకీయాల్లో బిజీ కావడం, అనుకున్న సమయానికి ప్రొడక్షన్ జరక్కపోవడంతో వెనకబడిపోయింది. మార్చి 28 రిలీజ్ డేట్ ఇచ్చారు. ఇప్పటివరకూ రెండు పాటలు వదిలారు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ వుంది. అనుకున్న సమయానికి ఈ సినిమా రాకపోయే అవకాశాలే ఎక్కువ. 'మ్యాడ్ 2' సినిమాకి జరుగుతున్న ప్రమోషన్స్ చూస్తుంటే హరిహర వీరమల్లు రాదనే సంగతి ఈజీగా తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ స్నేహం గురించి అందరికీ తెలుసు. పవన్ రాజకీయాల్లోకి త్రివిక్రమ్ తలదూర్చరు కానీ పవన్ సినిమా షూటింగులు మాత్రం త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. పవన్ సినిమాలు ఏ స్టేజ్ లో వున్నాయి, ఇంకెంత సమయం షూటింగ్ కి కేటాయించాలి.. ఇవన్నీ త్రివిక్రమ్ కి తెలుసు. మ్యాడ్ సినిమాకి త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మాత. త్రివిక్రమ్ కి వీరమల్లు రాక గురించి క్లారిటీ వుండే మ్యాడ్ రిలీజ్ డేట్ ఇచ్చారు. అందుకే నిర్మాత నాగవంశీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా పవన్ వస్తే మేము రామని ప్రకటించగలిగారు. ఇంత జోరుగా మ్యాడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.