మెగా ప్రిన్స్‌ అతనికి ఫిదా అయ్యాడు!

మరిన్ని వార్తలు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ హీరోగా నటిస్తున్న 'ఫిదా'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం యంగ్‌ హీరో హర్షవర్ధన్‌ రాణేని తాజాగా ఎంపిక చేశాడట దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఇంతకు ముందు హర్షవర్ధన్‌, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'అనామిక' సినిమాలో నటించాడు. తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. అయితే ఈ సినిమాలో శేఖర్‌ కమ్ముల హర్ష వర్ధన్‌ క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్‌ చేశాడట. గుర్తుండిపోయే పాత్రలో నటించానంటున్నాడు హర్షవర్ధన్‌. ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజకి, హర్షవర్ధన్‌కి మంచి ఫ్రెండ్షిప్‌ కుదిరిందట. షూటింగ్‌లో హర్షవర్ధన్‌తో కలిసి ఫ్రెండ్లీ మూమెంట్స్‌ ఎంజాయ్‌ చేశానని అంటున్నాడు మెగా ప్రిన్స్‌. ఇటీవలే 'మిస్టర్‌' సినిమాతో మన ముందుకు వచ్చాడు వరున్‌ తేజ్‌. త్వరలోనే 'ఫిదా'తో అలరించనున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించారు. ఎక్కువభాగం అమెరికాలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. అలాగే తెలంగాణ నేటివిటీతో కూడిన స్లాంగ్‌ని సాయిపల్లవి వంటబట్టించుకుందట. ఈ స్లాంగ్‌ నేర్చుకోవడం కోసం అమ్మడు బాగానే కష్టపడుతోందట. తమిళంలో 'ప్రేమమ్‌' సినిమాతో బాగా పాపులర్‌ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. 'ఫిదా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS